SSC Exams Hall Tickets | ఈ నెల 21 నుంచి టెన్త్ పరీక్షలు
వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కట్లు డౌన్‌లోడ్ ప్రారంభం..
Hyderabad : రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి టెన్తక్లాస్ పరీక్షలు ప్రారంభం కాన్నాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. అందుకు సంబంధించిన టైంటేబుల్‌లో గతంలో విడుదల చేశారు. అయితే పరీక్షల హాజరు కోసం హాల్‌టిక్కట్లు ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో నిర్వహిస్తారు. సెకండ్ లాంగ్వేజీ పరీక్షలను మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు నిర్వహిస్తారు. హాల్‌టిక్కెట్ల కోసం https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
* * *