Jntuh New Vc | జేఎన్‌టీయూ నూతన వీసీగా ప్రొఫెసర్ కిషన్‌రెడ్డి
ఆదేశాలు జారీ చేసిన సర్కారు
Hyderabad : రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన జేఎన్‌టీయూ కూకట్‌పల్లి వైస్ ఛాన్స్ లర్‌గా ప్రొఫెసర్ టీ కిషన్‌కుమార్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. అంతకు వీసీ నియామకానికి సంబంధించిన ఫైల్‌పై రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సంతకం చేశారు. వీసీగా ఆయన మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు. గత ఏడాదిలో మేలో ఆ యూనివర్సిటీకి వీసీ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆ పోస్టులో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి కొనసాగారు. ఆదే యూనివర్సిటీలో ఆయన మెకానికల్ విభాగంలో సేవలు అందించారు. అలాగే పండిట్ ధీన్‌దయాల్ పెట్రోలియం యూనివర్సిటీకీ వీసీగా ఆయన గతంలో సేవలు అందించారు.
* * *