OU Exams Shedule | ఉస్మానియా వ‌ర్సిటీ ప‌రీక్ష షెడ్యూల్ ఖ‌రారు

OU Exams Shedule | ఉస్మానియా వ‌ర్సిటీ ప‌రీక్ష షెడ్యూల్ ఖ‌రారు
 వివ‌రాలు వెల్ల‌డించిన ఓయూ
Hyderabad : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేశారు. ఈ మేర‌కు ఓయూ ప‌రీక్ష‌ల నియంత్ర‌ణ అధికారి ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఎంసీఏ (రెండేళ్ల కోర్సు) మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ లో బ్యాక్లాగ్, బీఎస్ ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్ – ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం) మొదటి, మూడు, అయిదు, ఏడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే పరీక్షా తేదీలకు సంబంధించిన‌ పూర్తి వివరాలను ఓయూ అధికాఆరిక వెబ్‌సైట్ లో పెట్టారు. వాటిని విద్యార్థులు చూసుకోవాలి.

*విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ : ఉస్మానియా యూనివర్సిటీ విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ప‌రీక్ష‌ల నియంత్ర‌ణ అధికారి ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లొమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీ లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 ఆల‌స్య‌ రుసుంతో పదో తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. అయితే ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ప‌రీక్ష‌లు, ఫీజు చెల్లింపు వంటి పూర్తి వివరాలకు ఓయూ వెబ్ సైట్‌ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version