Telanagna Group 2 Exam Results | గ్రూప్ 2 ఫ‌లితాలు విడుద‌ల‌

Telanagna Group 2 Exam Results | గ్రూప్ 2 ఫ‌లితాలు విడుద‌ల‌
టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫ‌లితాలు

Hyderabad : గ్రూప్‌-2 ఫ‌లితాలు మంగ‌ళ‌వారం టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. ఈ ఫ‌లితాలు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in లో పెట్టారు. ఈ మేర‌కు TSPSC చైర్మన్‌ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. గ‌త ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల‌లో గ్రూప్ 2 ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర‌ వ్యాప్తంగా గ్రూప్‌-2లో 783 పోస్టులు ఉన్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు తుది కీ, OMR, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు జనరల్ ర్యాంకింగ్‌ను టీజీపీఎస్సీ వెబ్‌లింకు www.tspsc.gov.in ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఈ పరీక్షకు మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 టాపర్ కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకులతో పాటు ఫైనల్‌ కీ కూడా విడుదల చేశారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version