Telangana Inter Exams | ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఉద‌యం 8:45 గంటల వరకే అనుమ‌తి

Telangana Inter Exams | ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఉద‌యం 8:45 గంటల వరకే అనుమ‌తి
స‌మ‌యం తర్వాత వస్తే పరీక్ష‌కు నో ఛాన్స్‌
విద్యార్థుల‌కు స్ప‌ష్టం చేసిన‌ ఇంటర్‌బోర్డు
ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు పూర్తి
వెల్ల‌డించిన తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు

Hyderabad : రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్‌బోర్డు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో కొన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింది. ముఖ్యంగా ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యే విద్యార్థులకు స‌మ‌యం పాల‌న విధించింది. ప‌రీక్ష స‌మ‌యానికి 15 నిమిషాల ముందుగానే ప‌రీక్ష కేంద్రాల‌లో గేట్లు మూసివేయాల‌న్న నిబంధ‌న‌లు పెట్టారు. అంటే ఉద‌యం 8.45 గంట‌ల లోపు ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తారు. అందుకు సంబంధించి నిబంధ‌న‌లు ఇంట‌ర్ బోర్డు అధికారులు వెల్ల‌డించారు.
ఇలా పరీక్ష ముందే గేట్లు క్లోజ్‌ చేయడం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. అయితే రాష్ట్రంలో ఇంటర్మీడియ‌ట్ వార్షిక‌ పరీక్షలు ఈ నెల‌ 5 నుంచి 25 వరకు జరుగుతాయి. ప‌రీక్ష‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9,96,541 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్టియర్‌ వారు 4,88,316, సెకండియ‌ర్ వారు 5,08,225 మంది ఉన్నారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఏమైనా సందేహాలున్న‌ట్ల‌యితే 92402 05555 టోల్‌ ఫ్రీ నంబర్‌తో పాటు, జిల్లా కంట్రోల్‌ రూం ఇన్‌చార్జి నంబర్లను సంప్రదించవచ్చు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version