Dycm Bhatti vikramark | సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అధికారికంగా 67 టీఎంసీల కేటాయింపు

Dycm Bhatti vikramark | సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అధికారికంగా 67 టీఎంసీల కేటాయింపు
సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Hyderabad : ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్రం ప్ర‌భుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని, దాంతో పాటు సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు కూడా మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ద్వారా ఖమ్మం జిల్లాలోని వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయ‌ని ఆయన వెల్ల‌డించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఇప్పించి, వారిని ఒప్పించి అధికారిక అనుమతులు సాధించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుతూ.. ఈ మేర‌కు మంత్రి ఉత్తమ్‌ను ఆయ‌న అభినందించారు. మంత్రి ఉత్తమ్ ప్రయత్నం ద్వారా భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున బీడు భూములు సాగు చేసుకునేందుకు అవకాశం వ‌చ్చింది అని డిప్యూటీ సీఎం తెలిపారు. దశాబ్దాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం వ‌ల్ల‌ అధికారిక అనుమతులు సాధించడం అభినందనీయమ‌ని ఆయ‌న కొనియాడారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version