State Local Elections | స్థానిక’ పోరుకు మోగిన నగారా
– ఎన్నికల షెడ్యూల్ విడుదల
-అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్
– నవంబర్ 11 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి
Vikasam, Hyderabad : రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగరా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ (సోమవారం ) ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ, అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీలకు సంబంధించిన ఖాళీల వివరాల గెజిట్ ను విడుదల చేశారు. 31 జిల్లాల 565 జడ్పీటీసీ, ఎంపీటీసీ 5,749 స్థానాలు నిర్ణయించాం
* ఎన్నికల వివరాలు..
-పోలింగ్ స్టేషన్ లు 31300
-గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు.
-మొత్తం 12, 733 గ్రామపంచాయతీలు.
-ఒక లక్ష 12,28 గ్రామపంచాయతీ వార్డులు.
-గ్రామపంచాయతీ ఎన్నికలకు 1,12,474 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు.
-రాష్ట్రంలో 15522 గ్రామపంచాయతీ పోలింగ్ లొకేషన్లో గుర్తింపు.
-రాష్ట్రంలో 16703168 మంది ఓటర్లు.
-పురుషులు.. 81 లక్షల 65,894
-స్త్రీలు . 85 లక్షల 36,770 మంది ఓటర్లు.
-9 వ తేదీన గురువారం నామినేషన్లు
-మొదటి ఫేస్ పోలింగ్ 23వ తేదీ
-రెండో విడత పోలింగ్ 27న జరుగనుంది
-11 నవంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది
* * *