State `Local` Elections | ‘స్థానిక’ పోరుకు మోగిన ఎన్నిక‌ల నగారా

State `Local` Elections | ‘స్థానిక’ పోరుకు మోగిన ఎన్నిక‌ల నగారా
– అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు.
– అక్టోబ‌ర్ 9 నుంచి నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం
– అదే నెల 11 నుంచి ఎంపీటీసీ, జ‌డ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు
-19 నుంచి స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు
– షెడ్యూల్ విడుదల
Vikasam, Hyderabad : రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నరాగా మోగింది. స్థానిక పోరుకు రంగం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు సోమ‌వారం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జ‌రుతాయ‌ని పేర్కొన్నారు.
* షెడ్యూల్ వివ‌రాలు ఇలా..
-అక్టోబర్ 9 నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం.
-అక్టోబర్ 11 నుంచి ఎంపిటిసి, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ప్రారంభం.
-అక్టోబర్ 17 నుంచి సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ప్రారంభం.
-అక్టోబర్ 19 నుంచి సర్పంచ్ స్థానానికి నామినేషన్లు ప్రారంభం
-అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
-అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు.
-పోలింగ్‌ రోజునే పంచాయతీ ఎన్నిక‌ల‌ ఫలితాలు.
-నవంబర్‌ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version