Bangalore Hostels | రియ‌ల్ ఎస్టేట్‌, రాజ‌కీయ చ‌ర్చ‌లు వ‌ద్దు

Bangalore Hostels | రియ‌ల్ ఎస్టేట్‌, రాజ‌కీయ చ‌ర్చ‌లు వ‌ద్దు
హోట‌ల్‌లో నోటీసు బోర్డు పెట్టిన పాక‌శాల రెస్టారెంట్ యాజ‌మాన్యం
సోష‌ల్ మీడియాలో చ‌ర్చానీయాంశంగా మారిన హోట‌ల్ నిబంధ‌న‌
Hyderabad : బెంగుళూరులో కొన్ని హోటళ్ల‌లో ప్రత్యేకమైన నిబంధనలు విధిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించి ప‌లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. బెంగళూరులోని ‘పాకశాల’ అనే రెస్టారెంట్‌ కస్టమర్లకు చేసిన అలాంటి ఓ సూచన ఇప్పుడు సోషల్‌ మీడియా వేధికంగా చర్చ జ‌రుగుతుంది. ‘ఈ సౌకర్యం భోజనం చేయడానికి మాత్రమే. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాల గురించి చర్చించడానికి కాదు. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి’ అన్న ఆ హోటల్‌ సూచిక బోర్డ్‌ను ఎక్స్‌లో ఓ యూజర్‌ పోస్ట్‌ చేయగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ఒక సోష‌ల్ మీడియా యూజర్‌ తన అనుభవాన్ని పేర్కొంటూ.. ‘రాజకీయాల గురించి చర్చ పక్కదారి పడుతుంది. వచ్చినవాళ్లు కేవలం కాఫీ ఆర్డర్‌ చేసి గంటల కొద్దీ రాజకీయాలు, రియల్‌ ఎస్టేట్‌ గురించి మాట్లాడతారు. ఇది హోటల్‌ వాళ్ల వ్యాపారంపై ప్రభావం చూపుతుంది’ అని వాఖ్య‌నించారు. అయితే బెంగుళూర్ ప‌ట్ట‌ణంలో ఇలాంటి సూచిక బోర్డులు స‌ర్వ‌ సాధారణమేనని కొందరు కామెంట్‌ చేశారు. కొందరు యూజర్లు హోటల్‌ వాళ్ల నిబంధనను సమర్థించగా, మ‌రి కొందరు అంగీకరించ లేకపోయారు. ‘మనం ఏం చర్చించుకుంటున్నాం అనేది హోట‌ల్ యాజ‌మాన్యానికి ఎలా తెలుస్తుంది?’ అని ఓ యూజర్‌ సందేహం వ్యక్తం చేశారు! ఈ విధంగా బెంగుళూరులోని హోట‌ళ్ల‌లో ఇలాంటి నిబంధ‌న‌లు విధించ‌డంతో ప‌లు రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపారులు షాక్‌కు గుర‌వుతున్నారు.
* * *

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version