Summer Time | సమ్మర్ వచ్చింది.. ఏసీలతో జర భద్రం
ఏసీల వాడకంతో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు
గుండే, శ్వాసకోస, చర్మ సంబంధ వ్యాధులకు అవకాశం
ఏపీలతో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు
Hyderabad : ప్రజల జీవన విధానాలలో రోజు రోజుకు మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో వేసవి కాలంలో పేద మధ్య తరగతి కుటుంబికులు అధిక సంఖ్యలో ఫ్యాన్లు, కూలర్లకే పరిమితయ్యేవారు. కాని ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా ఏసీలకు అలవాటు పడుతున్న పరిస్థితులు వచ్చాయి. కూలర్ల కాలం పోయి.. ఏసీల కాలం వచ్చింది. దీంతో ఇంటింటికి ఏసీలు అన్న చందంగా తయారైంది. అలాగే గతంలో సంపన్న వర్గాలు లేదా కార్పొరేట్ స్థాయి కార్యాలయాలల్లో ఏసీలను వినియోగం ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి పనిచేసే చోట ఏసీలను ఉపయోగిస్తున్నారు. ఇంట్లో హాల్ గదితో పాటు ప్రతి బెడ్‌రూమ్‌కు ఏసీ అనివార్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏసీల వినియోగం అధికమైంది. సర్వ సాధారణంగా ఏసీలను వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతల అనుగుణంగా వినియోగించుకోవాలి. ఇప్పుడు ప్రతి కార్యాలయాలలో, అన్ని వేళల్లో అందుబాటులో వచ్చాయి. అదే అలవాటుతో ఏసీలను అధికంగా వాడుతున్నారు. ఏసీల వాడుతున్నంత వరకు మనసుకు హాయిగా, శరీరానికి చల్లగాను ఉంటుంది. కాని వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు వస్తున్నాయి. మనిషి ఆరోగ్యంపై పడుతుంది. ఈ సంగతి ప్రస్తుతం ఏసీ వినియోగదారులు గుర్తించడం లేదు. ఏసీల్లో అధిక సమయం గడుపుతుండడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఏసీల్లో గడపడాన్ని తగ్గించుకోవాలని వారు సూచిస్తున్నారు. పైగా చాలా మందికి విటమిన్ డీ సమస్యలు కూడా ఎదురవుతున్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ సమస్యలు ఆడవారితో పాటు మగవాళ్లలో కూడా ఇటీవల కాలంలో అధికమైందని చెప్పుతున్నారు. దీనికి కారణం ఇంట్లో వాడే ఏసీలతో పాటు కార్లతో పాటు బస్సులలో కూడా ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు.
అనేక సమస్యలు వస్తున్నాయి.. ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. చర్మల తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. దురద రావడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే అలసత్వం, తలనొప్పితో పాటు ఎండను తట్టుకునే శక్తి క్రమంగా తగ్గిపోతుంది. అలాగే శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ఏసీల పని చేయడం వల్ల, వాటి ఫిల్టర్లలో దుమ్ము, ధూళి, కాలుష్యానికి సంబంధించి కారకాలు బాగా పేరుకుపోతాయి. ఏసీ వాడుతున్నప్పుడు అవి విడదలై ముగ్గుద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలి. చల్లదనం వల్ల ఒంటి నొప్పులతో పాటు కీళ్లు, మోకాళ్ల నొప్పులు వస్తాయి. కంటి సంబంధ వ్యాధులు బయటపడుతాయి. కండ్ల దురదలు వస్తాయి. ఏసీలు అధికంగా వాడడం వల్ల గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి. సైనసైటీస్, ఇస్నోఫిలియా, దగ్గు జలుబు తోడుగానే ఉంటాయి. అయితే ఏసీలో ఎక్కవ సేలు గడిపే వారు తమ ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలంటే అన్ని రకాల విటమిన్‌లకు సంబంధించి ఆహారం తీసుకోవాలి. వేడి చేసిన వాటర్ తాగాలి. ఎక్కువ గంటలు ఏసీలో గడుపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాలయాల్లో మధ్య మధ్యలో బయటకు వెల్లి వస్తుండాలి. మొత్తంగా అవసరమైనప్పుడు తప్ప మిగితా సమయంలో సాధ్యమైనంత వరకు ఏసీలకు దూరంగా ఉండటమే బెటరని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
* * *