Actor posani krishna murali | న‌టుడు పోసాని ని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

Actor posani krishna murali | న‌టుడు పోసాని ని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!

Hyderabad : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలుగు సిని న‌టుడు పోసాని క్రిష్ణ‌ముర‌ళిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌ను పోలీసులు హైద‌రాబాద్‌లోకి అదుపులోకి తీసుకుని ఏపీకి త‌ర‌లించారు. పోసాని అరెస్ట్‌తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి బుధ‌వారం రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని పై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. ఈ విష‌యంలో నోటీసులో పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించారు. దీంతో ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై జనసేన నేత జోగినేని మణి కేసు పెట్టారు. అలాగే ఇదే కేసులో.. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్‌మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ స‌మ‌యంలో పోసాని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు స్ప‌ష్టం చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీలో పలు పోలీస్‌స్టేషన్‌లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోసాని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. మ‌రో ప‌క్క పోసాని అరెస్ట్‌ను వైసీపా నాయ‌కులు ఖండించారు. ఏపీలో కూటమి నాయకులు కావాలనే తమ వారిపై కేసులు న‌మోదు చేస్తున్నార‌ని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మొన్న వల్లభనేని వంశీ, నేడు పోసానిని అరెస్ట్ చేశారన్నారు. అయితే.. అరెస్టుల వెనుక రాజకీయాలు ఏమీ లేవని.. చట్టం తన పని తాను చేసుకు పోతుందని కూటమి నేతలంటున్నారు. అయితే ఈ అరెస్టుల నేప‌థ్యంలో ఏపీలో ఎలాంటి రాజ‌కీయాల‌కు దారి తీస్తాయో అన్న ఉత్కంఠ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నారు
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version