Election Commission New CEC | ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ్ఞానేశ్‌కుమార్‌

Election Commission New CEC | ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ్ఞానేశ్‌కుమార్‌

Hyderabad : భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా (Chief Elelction Commissioner) జ్ఞానేశ్‌కుమార్ బుధ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయ‌న గ‌త ఏడాది మార్చి నుంచి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 17న ఆయ‌న సీఈసీగా ప‌దోన్న‌తి ల‌భించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సీఈసీగా విధుల్లో ఉన్న రాజీవ్‌కుమార్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డంతో ఆస్థానంలో జ్ఞానేశ్‌కుమార్‌ను నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ధాన మంత్రి మోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్‌గాంధీతో కూడిన ఎంపిక క‌మిటీ ఈ మేర‌కు సోమ‌వారం సీఈసీగా ఆయ‌ను సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రప‌తి ద్రౌప‌దిముర్ము ఆమోదం తెలిపారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version