RRB Exam Shedule | రైల్వే ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
మార్చి 19, 20 తేదీలలో పరీక్షలు
వారం రోజుల ముందుగా పరక్ష సెంటర్లు ఫైనల్

Hyderabad : రైల్వే ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్ల పరిధిలో పలు రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. రైల్వే ఉద్యోగాలకు సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్, మెటలార్జికల్ సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను (RRB Exam Shedule) వెల్లడించింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీటీ-2) విధానంలోనే నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మార్చి 19, 20వ తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహిస్తారు. వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌ను ఫాలో కావాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) తెలిపింది. అలాగే పరీక్ష సెంటర్ వివరాలు పరీక్షకు పది రోజుల ముందు తెలియచేస్తారు. పూర్తి వివరాల కోసం ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
* * *