Indian Cricket Team | `ఛాంపియ‌న్స్` మ‌న‌మే

Indian Cricket Team | `ఛాంపియ‌న్స్` మ‌న‌మే
మ‌రో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్న ఇండియ‌న్‌ టీమ్‌
ప‌లువురు ప్ర‌శంస‌లు అందుకున్న క్రికెట్ టీమ్‌
Hyderabad : గ‌త ఏడాదిలో టీ20 పోటీలో వరల్డ్‌ కప్ విజేత‌లుగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టు.. ఇప్పుడు ఏడాది తిరగకముందే మరో ఐసీసీ ట్రోఫీనీ త‌మ సొంతం చేసుకుంది. మినీ వ‌ర‌ల్ కప్‌గా భావించే ‘చాంపియన్స్‌ ట్రోఫీ’ని టీమ్‌ఇండియా 12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గెలుచుకుంది. టోర్నీ మొత్తంగా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రోహిత్ త‌న స‌త్తా చాటారు. ఇక‌ ఫైనల్‌ పోరులోనూ అదే జోరును కొనసాగించ‌డంతో పాటు మూడోసారి ‘చాంపియన్స్‌’గా నిలిచిన‌ ఇండియ‌న్ టీమ్‌ దుబాయ్‌లో తీన్మార్‌ కొట్టింది. భారత స్పిన్నర్ల ధాటికి తక్కువ స్కోరుకే తోకముడిచిన కివీస్‌.. అనంతరం ఛేదనలో రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు శ్రేయాస్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో తలవంచక తప్పలేదు.
దాదాపు ప‌న్నెంటు సంవ‌త్స‌రాల (పుష్కరకాలం) తర్వాత ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ భారత్ ద‌క్కింది . పోయిన సంవ‌త్స‌రం టీ20 వరల్డ్‌ కప్‌ను అందుకున్న‌ రోహిత్‌ సేన.. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీనీ కైవసం చేసుకుంది. టోర్నీలో అజేయంగా ఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా.. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన స్పిన్‌ థ్రిల్లర్‌లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్‌’గా నిలిచింది. అయితే స్పిన్నర్ల అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్‌లో భారత్‌ విజయం సొంతం చేసుకుంది. కివీస్‌ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనలో భార‌త్ విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ఇండియ‌న్ టీమ్ అందుకుంది.
* * *

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version