CM Revanth Reddy | భట్టి ప్రైవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ బాగుంది

CM Revanth Reddy | భట్టి ప్రైవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ బాగుంది
భట్టి నేను జోడెడ్ల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తాం
ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Hyderabad : రాష్ట్ర‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ బేషుక్‌ గా ఉందని, తామిద్దరం కలిసి జోడేడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
త‌న‌ మిత్రులు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితులు పంచిన ఉగాది ప్రసాదం లాగా షడ్రుచులతో క‌లిగి ఉన్నదని సీఎం అభివర్ణించారు. తీపి, పులుపు , కారం కాస్త కూస్తో ఉప్పు కూడా ఉంది, ఎందుకంటే కొన్ని అంశాల్లో నియంత్రణ మరికొన్ని అంశాల్లో వారు చాలా లిబరల్ గా ముందుకు వచ్చారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారం అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలను వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యం అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యం, పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. ఈ ఉగాది పండ‌గ‌ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version