Telangana News Mlc`s | టీచ‌ర్ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క్రుషి

Telangana New Mlc`s | టీచ‌ర్ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క్రుషి
నూత‌న విద్యా విధానంపై ఫోక‌స్‌
ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ ఎమ్మెల్సీ మ‌ల్క కొముర‌య్య‌
అనంత‌రం ఉపాధ్యాయుల సంఘాల‌తో భేటీ

Hyderabad : రాష్ట్రంలో ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లు చాలా పేరుకుపోతున్నాయ‌ని, వాటిని ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రించ‌డం కోసం తాను క్రుషి చేస్తాన‌ని నూత‌న ఎమ్మెల్సీ మ‌ల్క కొముర‌య్య హ‌మీ ఇచ్చారు. ఈ మేర‌కు సోమ‌వారం శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఎమ్మెల్సీగా తాను ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం సికింద్రాబాద్‌లోని త‌న నివాస ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ సంఘాల స‌మావేశంలో ఆయ‌నను స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్ర‌స్తుతం ఎన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారో.. అందుకు సంబంధించి సంఘాల వారీగా త‌న‌కు విన‌తి ప‌త్రాలు అందించాల‌ని కోరారు. స‌మ‌స్య‌ల‌న్నింటి జాబితా రూపంలో త‌యారు చేసి, వాటిని స‌ర్కారుతో ఏ విధంగా ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంటుందో.. ఆ మేర‌కు చ‌ర్య‌లు కొన‌సాగిస్తామ‌న్నారు. అలాగే రాష్ట్రంలో నూత‌న విద్యా విధానంపై ఫోక‌స్ పెడుతాన‌ని తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించి సానుకూల నిర్ణ‌యాలు తీసుకునే విధంగా త‌న వంతు స‌హ‌కారం ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. మ‌ల్క కొముర‌య్య ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంతో అయ‌న కుటుంబ స‌భ్యులూ పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు నూత‌నంగా ఎంపికైనా పింగిళి శ్రీపాల్ రెడ్డి , నెల్లికంటి సత్యం , కేతావత్ శంకర్ నాయక్ , అద్దంకి దయాకర్ , ఎమ్ విజయశాంతి, చిన్నమైల్ అంజిరెడ్డితో శాసన మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు బి లక్ష్మారెడ్డి , బాలు నాయక్ , మందుల శామ్యూల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version