Prime Minister MODI | నా సోష‌ల్ మీడియా ఖాతాలు మ‌హిళ‌లే నిర్వ‌హిస్తున్నారు

Prime Minister MODI | నా సోష‌ల్ మీడియా ఖాతాలు మ‌హిళ‌లే నిర్వ‌హిస్తున్నారు
మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ప్ర‌ధాని మోడి
ఎక్స్‌లో పోస్టు చేసిన ప్ర‌ధాని..
Hyderabad : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మ మోదీ ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌న్ని మ‌హిళ‌లే నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. తాను ఎప్పుడూ తెగ బిజీగా ఉండే ప్ర‌ధాని ప్ర‌తి సంఘ‌ట‌న‌పై తాను సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తారు. అందుకు సంబంధించిన స‌మాచారం సోష‌ల్ మీడియా ద్వారా తెలుపుతారు. అయితే ఈ విష‌యంలో మ‌హిళ‌ల పాత్ర ఎంతో ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. అలాగే మ‌హిళా సాధికార‌త కోసం ఎన్‌డీయే స‌ర్కారు క్రుషి చేస్తుంద‌ని పీఎం స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా (Internationa Womens Day) ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన సోషల్‌ మీడియా ఖాతాలను నిర్వహించేది మహిళలే అంటూ వెల్లడించారు. ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటే ప్రధాని, ప్రతి సంఘటనపై ఎప్పటి కప్పుడు తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా తన స్పందనను తెలియజేస్తూ ఉంటారు. అయితే అది ఆయనే స్వయంగా వాడరు. ఆయనకంటూ ప్రత్యేక సిబ్బంది ఉంటారు. వాళ్లు మోదీ ఆదేశాల మేరకు పోస్ట్‌లు చేస్తూ వాటి నిర్వ‌హ‌ణ చూస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత, మహిళా అథ్లెట్లకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతపై మంచి సందేశాన్ని అందించే ప్ర‌య‌త్నం చేశారు. అందుకోసం భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబుకి ప్రధాన మోడీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. “వనక్కం! మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్రాపర్టీస్‌ను మహిళా దినోత్సవం నాడు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను చెస్ ఆడతాను. పలు టోర్నమెంట్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది.” అని వైశాలి పేర్కొన్నట్లు ప్రధాని మోదీ త‌న ఎక్స్ ఖాతా తెలిపారు.
వైశాలితో పాటు మరో ఇద్దరు సైంటిస్టులు కూడా ప్రధాని మోదీ అకౌంట్ నుంచి తమ సందేశాన్ని ఉమెన్స్ సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చారు. వారిలో అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోనిలు ప్రధాని మోడీ ఎక్స్‌ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ “అంతరిక్ష సాంకేతికత, అణు సాంకేతికతలో మహిళా సాధికారత. మేము అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోని, మహిళా దినోత్సవం నాడు ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్రాపర్టీలకు నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. సైన్స్‌కు సైన్స్‌కు ఇండియా అత్యంత ఉత్సాహభరితమైన ప్రదేశం, ఈ రంగంలో మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నాం” అని వారు పేర్కొన్నారు. ప్ర‌ధాని సందేశం ఇప్పుడు ప‌లు సోష‌ల్ మీడియాలో వైర‌లైంది.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version