World water day | నీటిని పొదుపుగా వాడుకుందాం

World water day | నీటిని పొదుపుగా వాడుకుందాం
భుగ‌ర్భ జ‌లాల‌ను కాపాడుకుందాం
రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపు

Hyderabad : `నీటిని పొదుపుగా వాడుకుందాం – భూగర్భ జలాలను కాపాడుకుందాం` అని రాష్ట్ర బీసీ సంక్షేమ, ర‌వాణ‌ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శ‌నివారం (ఈ నెల 22న )వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రపంచ నీటి దినోత్సవం సంద‌ర్భంగా మనమంద‌రం నీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రంఎందైనా ఉంద‌న్నారు. ఈ మేర‌కు అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకుందామ‌ని, వచ్చే తరాలకు అవకాశాలు క‌ల్పిద్దామ‌ని ఆయ‌న అన్నారు. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల గ్రౌండ్ వాటర్ పడిపోతుంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా గ్రౌండ్ వాటర్ లెవ‌ల్స్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాల‌న్నారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాల‌న్నారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్న‌ట్లు తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాల‌ని, నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాల‌న్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని అంద‌రితో ప్రతిజ్ఞ తీసుకోవాల‌న్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version