SC sub-categorisation | ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

SC sub-categorisation | ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
మూడు వ‌ర్గాలుగా 56 ఎస్సీ కులాలు
సోమ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయ‌ని ప్ర‌క‌టించిన స‌ర్కారు
విద్యా ఉద్యోగ రంగాల్లో జీవో అమ‌లు..
Hyderabad : రాష్ట్రంలో షెడ్యూల్ కులాల‌కు (ఎస్‌సీ) వ‌ర్గీక‌ర‌ణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంపూర్ణంగా ఆమోదం తెలిపింది. గ‌త నెల మార్చి 19న అసెంబ్లీలో ప్రైవేటు పెట్టిన బిల్లుకు అనుగుణంగా.. సోమ‌వారం జీవో ఎంఎస్ 33ను విడుద‌ల చేసింది. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఎస్సీలోన 56 కులాలను మూడు గ్రూపులుగా ప్ర‌భుత్వం విభ‌జించింది. ఈ మేర‌కు ఏ గ్రూపుకు 1 శాతం, బీ గ్రూపుకు 9 శాతం, సీ గ్రూపుకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు వ‌ర్తిస్తాయ‌ని స‌ర్కారు ఆ జీవోలో పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాల‌లో ఎస్సీలకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాని ఈ మేర‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version