MLC Kavita | రాజ‌కీయంగా న‌ష్ట‌పోతున్న నారీమ‌ణులు

MLC Kavita | రాజ‌కీయంగా న‌ష్ట‌పోతున్న నారీమ‌ణులు
తెలంగాణ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మ‌హిళ‌ల‌కు కాంగ్రెస్ స‌ర్కారు ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల్సిందే అని డిమాండ్‌
Hyderabad : రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా నష్టపోతున్నార‌ని ఎ మ్మెల్సీ క‌విత విమ‌ర్శించారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేద‌ని, మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యాన వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం బీఆర్ఎస్ భ‌వ‌న్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన‌ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం వేడుక‌ల్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వీట్లు పంచుకుని సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..
జనగణనకు బడ్జెట్ లో ఎందుకు నిధులు పెట్టలేదుని ప్ర‌శ్నించారు. త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతార‌ని తెలిపారు. ప్రతీ మహిళకు రూ 2500 ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామ‌ని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహీర్గతం చేయాల‌న్నారు.
కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశార‌ని, మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టార‌ని తెలిపారు. కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసే కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉంద‌ని మండిప‌డ్డారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నార‌న్నారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉంద‌న్నారు. సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయమ‌న్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంద‌ని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంద‌ని ఎమ్మెల్సీ క‌విత స్ప‌ష్టం చేశారు. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణమ‌ని తెలిపారు. మహిళలకు కులమతాలు లేవ‌ని, మహిళలది అంతా ఒకే కులమ‌ని పేర్కొన్నారు. మహిళలలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి, ఇళ్లలో మహిళలు ద్వితియ శ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న వాదన వీగిపోవాలి, అమెరికా 40 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే భారత్ లో మాత్రం అది 17 శాతంగానే ఉంద‌ని వివ‌రించారు. దేశంలో 50 శాతం మహిళలు ఉద్యగాలు చేస్తే దేశ జీడీపీకి మనం 5 లక్షల కోట్ల ఆదాయం ఇవ్వగలుగుతామ‌న్నారు. కానీ మహిళలు ఉద్యోగాలు చేయదగడానికి గల సౌకర్యాలు ఉన్నాయా ? అన్నది ఆలోచించాల‌న్నారు. భూగర్భ గనులల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగార‌ని, అయినా అనేక అవాంతరాలు ఉన్నాయ‌ని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఎంతైన ఎమ్మెల్సీ క‌విత ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ మ‌హిళా నేత‌లు పాల్గొన్నారు.
“అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళా సోదరీమణులతో సంభాషించడం ఆనందాన్ని కలిగించింది. కుటుంబాల సాధకబాధకాలు ఎన్ని ఉన్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ భవిష్యత్తు కోసం కంటున్న కలలను నెరవేర్చుకోవడం దిశగా అడుగులు వేస్తున్న మహిళలతో ముచ్చటించాను. మహిళా దినోత్సవం కేవలం ఉత్సవంగా జరుపుకోవడం కోసమే కాకుండా మహిళలు తమలో ఉన్న శక్తిని, బలాన్ని వెలికి తీయడానికి, సాధికారత సాధించడానికి నాంది కావాలని ఆకాంక్షిస్తున్నాను“. అని ఎమ్మెల్సీ క‌విత త‌న ఎక్స్ ఖాతాలో అన సంతోషాన్ని పోస్టు చేసింది.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version