Women Specials Trian | వందే మ‌హిళా..

Women Specials | వందే మ‌హిళా..
మ‌హిళ‌ల‌తో న‌డిచిన వందేభార‌త్ ఎక్స‌ప్రెస్ రైలు
మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా రైల్వే అధికారులు వినూత్న నిర్ణ‌యం
Hyderabad : అంత‌ర్జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా మొత్తం మ‌హిళా మ‌నుల‌తోనే వందేభార‌త్ ప్ర‌త్యేక రైలును న‌డిపించారు. ఈ మేర‌కు (శ‌నివారం ఉద‌యం) మ‌హిళా సిబ్బంది ( All womens Train)తో వందేభార‌త్ రైలును న‌డిపారు. అయితే ముంబైలోని సీఎస్ఎంటీ రైల్వే స్టేష‌న్ నుంచి షిర్డి వ‌ర‌కు ఆ రైలు ప్రయాణించింది. ఆలియాలోని తొలి మ‌హిళా లోకో పైలెట్ సురేఖా యాద‌వ్‌, అసిస్టెంట్ లోకో పైలెట్ సంగీత కుమారి ఇరువురు ఆ రైలు డ్రైవ‌ర్లుగా త‌మ విధులు నిర్వ‌హించారు. అయితే ఈ రైలు శ‌నివారం ఉద‌యం 6.20 నిమిషాల‌కు ఆ రైలు బ‌య‌లుదేరింది. రైల్వేశాఖ‌లో మ‌హిళ‌ల పాత్ర పెరుగుతోంద‌న్న ఉద్దేశాన్ని రైల్వే అధికారులు ఈ విధంగా వ్య‌క్తం చేశారు. మ‌హిళా ఉద్యోగులు న‌డిపిన‌ ఈ రైలులో.. టీటీఈలు అంద‌రు కూడా మ‌హిళ‌లే ఉండ‌డం విశేషం. హెడ్ టికెట్ ఎగ్జామిన‌ర్ అనుష్కా కేపీ, ఎంజే రాజ్‌పుత్‌, సీనియ‌ర్ టికెట్ ఎగ్జామిన‌ర్ సారికా ఓజా, సువ‌ర్ణా పాస్తే, క‌వితా మార‌ల్‌, మనిషా రామ్ ఈ రైలులో విధులు నిర్వ‌హించారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version